మ‌రో విషాదం.. రిషీ క‌పూర్ క‌న్నుమూత‌

బుధవారం బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం నుండి పూర్తిగా కోలుకోక ముందే బాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ నటుడు రిషీకపూర్‌ (67) కొద్ది సేపటి క్రితం  కన్నుమూశారు. 2018లో రిషీకి క్యాన్సర్ బయటపడింది. అప్పటి నుంచి ఎక్కువ సమయం న్యూయార్క్‌లోనే ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు.ఈ రోజు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ చేర్పించారు.ఆయ‌న మృతికి సంబంధించిన విష‌యాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్వీట్ లో తెలిపారు.  ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప్రార్ధించారు. 1970లలో సెన్సేషనల్ హిట్ చిత్రం బాబీతో హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన రిషీ కపూర్ .. లెజెండరీ హీరో, డైరెక్టర్ రాజ్ కపూర్ రెండవ కుమారుడు.