ఉమ్మినందుకు 500.. మాస్కు ధరించనందుకు 100 జరిమానా

బెంగళూరు : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న విషయం విదితమే. బహిరంగంగా ఉమ్మితే జరిమానా విధిస్తామని కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్లు హెచ్చరించాయి. కానీ ప్రజలు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోవడం లేదు. 


కర్ణాటకలోని శిమోగా సిటీ కార్పొరేషన్‌ అధికారులు మాత్రం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మణి అనే వ్యక్తి మాస్కు ధరించకుండా బయటకు వచ్చాడు. అంతే కాదు బహిరంగ ప్రదేశంలో ఉమ్మేశాడు. దీంతో అతనికి ఉమ్మినందుకు రూ. 500, మాస్కు ధరించనందుకు రూ. 100 జరిమానా విధించారు.