చివరి రోజు మ్యాచ్‌.. ప్రేక్షకులు లేకుండానే!

రాజ్‌కోట్‌: రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర-బెంగాల్‌ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌ తుది అంకానికి చేరుకుంది. రేపు చివరి రోజు మ్యాచ్‌ కావడంతో ఫలితం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. సౌరాష్ట్ర తొలి రంజీ టైటిల్‌ను సాధించాలనే ఆశపడుతుంటే, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బెంగాల్‌ మొదటి టైటిల్‌ కోసం ఉవ్విళ్లూరుతోంది. కాగా, ఈ మ్యాచ్‌ ఆఖరి రోజు ఆటలో ప్రేక్షకులు లేకుండానే జరుగనుంది.  కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ అలర్ట్‌ అయ్యింది. దాంతో ఏ మ్యాచ్‌నైనా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని నేషనల్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్స్‌తో పాటు బీసీసీఐకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పట్నుంచి మొదలుకొని ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ మ్యాచ్‌లు జరిగే వేదికల్లో ప్రజల్ని అనుమతించరాదనే నిబంధన విధించింది. దాంతో శుక్రవారం రంజీ ఫైనల్‌ చివరి ఆట ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. దీని ప్రభావం ఐపీఎల్‌పై కూడా పడే అవకాశం ఉంది.(ఐపీఎల్‌ : ఏప్రిల్‌ 15 వరకు ఆ ఆటగాళ్లు దూరం )