న్యూఢిల్లీ: కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచదేశాల్లో వేగంగా విస్తరిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. దీంతోపాటు కరోనా వైరస్ ఆందోళనలు అనేక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాల ద్వారా ఈ మహమ్మారి మరింత విజృంభించే అవకాశం ఉందున్న అంచనాల నేపథ్యంలో ఇప్పటికే అనేక దేశాలు విమాన ప్రయాణాలను నిషేధించాయి. వీసాలను నిలిపివేసాయి. తాజా పరిణామాలతో విదేశీ పర్యాటక రాకపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే ఉన్న పరిస్థితి మరింత దారుణంగా పరిణమిస్తోంది. దీంతో విమాన చార్జీలు దాదాపు 70 శాతం క్షీణించాయి. అలాగే హోటల్ రేట్లు సగటున 40 శాతం పడిపోయాయి.
కరోనా : విమాన, హోటల్ చార్జీలు ఢమాల్